కలం, కరీంనగర్: నగరంలో గణేష్ నిమజ్జనం (Ganesh Immersion), శోభయాత్ర ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా స్వర్వం సిద్ధం చేసి…నగరపాలక సంస్థ ద్వారా గతం కంటే ఘనంగా ఏర్పాట్లు చేశామని నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ (Mayor Kolagani Srinivas) తెలిపారు. కరీంనగర్ నగరపాలక సంస్థ పరిదిలో బుధవారం జరగనున్న గణేష్ నిమజ్జన ఉత్సవాల సందర్భంగా మంగళవారం రోజు మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు, కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, అధికారులు, హిందూ ఉత్సవ కమిటీ సభ్యులతో కలిసి టవర్ సర్కిల్, రాంనగర్, కామాన్ ప్రాంతంలో పర్యటించారు. నిమజ్జనం ఉత్సవాల ఏర్పాట్లను తనిఖీ చేసి పరిశీలించారు.
ప్రధాన గణేష్ పాయింట్ అయిన టవర్ సర్కిల్ పరిసరాల్లో పర్యటించి.. చేస్తున్న ఏర్పాట్లపై అధికారులు, సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. ఎలాంటి లోటుపాట్లు లేకుండా గణేష్ పాయిట్లతో పాటు నిమజ్జనం పాయిట్ల వద్ద ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. టవర్ సర్కిల్ గణేష్ పాయింట్ ను పూలతో, చక్కటి లైటింగ్ సిస్టమ్ తో సుంధరంగా అలంకరించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. కొత్తపల్లి మానకొండూర్ చెరువులు, చింతకుంట కెనాల్ నిమజ్జనం పాయింట్ల వద్ద చేస్తున్న ఏర్పాట్లను తనిఖీ చేసి పరిశీలించారు. నిమజ్జనం ఏర్పాట్లలో ఎలాంటి లోటుపాట్లు లేకుండ పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసేలా అధికారులకు, సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు.
ఈ సందర్భంగా మేయర్ కొలగాని శ్రీనివాస్ (Mayor Kolagani Srinivas) మాట్లాడుతూ.. గణేష్ విగ్రహాలు ప్రశాంత వాతావరణంలో నిమజ్జనం అయ్యేలా కరీంనగర్ నగరపాలక సంస్థ ద్వారా పాలకవర్గం ఘనంగా ఏర్పాట్లు చేసిందన్నారు. రూ.1.50 కోట్ల నిధులను కేటాయించి.. నగరంలోని టవర్ సర్కిల్, రాంనగర్, కమాన్ తదితర గణేష్ పాయింట్లతో పాటు కొత్తపల్లి, మానకొండూర్, చింతకుంట, బొమ్మకల్, దుర్షెడ్, గోపాల్ పూర్ నిమజ్జనం పాయిట్ల వద్ద అన్ని ఏర్పాట్లు సిద్దం చేశామని స్పష్టం చేశారు. ప్రధానంగా నగరంలోని టవర్ సర్కిల్ ప్రాంతం ప్రధాన గణేష్ శోభయాత్ర పాయింట్ కాబట్టి… చిన్న భారీ విగ్రహాలన్ని అదే పాయింట్ నుండి నిమజ్జనానికి బయలుదేరుతాయి కాబట్టి టవర్ సర్కిల్ పాయింట్ లో భారీగా ఏర్పాట్లు చేశామని తెలిపారు.
భక్తులకు, మండపాల నిర్వాహకులకు, ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేశామన్నారు. శోభయాత్ర ప్రధాన గణేష్ పాయింట్ టవర్ సర్కిల్ ను చక్కటి లైటింగ్, వివిధ రకాల పూలతో సుంధరంగా తీర్చిదిద్దామని తెలిపారు. భక్తులు ఎవరికి అసౌకర్యం కలగకుండా టవర్ సర్కిల్, రాంనగర్, కమాన్, తదితర పాయిట్ల లో త్రాగు నీటి సౌకర్యం, మెడికల్ క్యాంపు సౌకర్యం కూడ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నగరం మొత్తం శోభయాత్ర వెళ్లే మార్గంలో రహదారులన్నీ సీసీ ప్యాచ్ వర్క్ చేశామని తెలిపారు.
129.45 లక్షలతో సీసీ ప్యాచ్ పనులు చేపట్టి గుంతలు పూడ్చడం జరిగిందని తెలిపారు. అంతే కాకుండా మూడు నిమజ్జనం పాయింట్ల వద్ద దాదాపు రూ.55 లక్షలతో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తగిన ఏర్పాటు పూర్తి చేశామని తెలిపారు. నిమజ్జనం (Ganesh Immersion) జరిగే సమయంలో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా నగరపాలక సంస్థ, పోలీస్ శాఖల అధికారులతో సమన్వయం చేసుకొని తగిన జాగ్రత్త చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. వినాయక మండపాల నిర్వాహకులు, భక్తు లందరూ ఉత్సవ కమిటీలకు, అధికార యంత్రాంగానికి సహకరించి గణేష్ నిమజ్జన శోభయాత్ర ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో విజయవంతం చేయాలని పిలుపు నిచ్చారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు వాసాల రమేష్, బోయినపల్లి ప్రవీణ్ కుమార్, వంగల పవన్, కో ఆప్షన్ సభ్యులు కన్న కృష్ణ, బర్బీర్ సింగ్, హిందూ ఉత్సవ కమిటీ సభ్యులు, నగరపాలక సంస్థ అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
Also Read : విద్యార్థులకు టిఫిన్.. సిద్ధమైన సీఎం బ్రేక్ ఫాస్ట్ కిచెన్!
Follow Us On : WhatsApp

