యూపీలో విషాద ఘటన.. డీజే శ‌బ్దానికి విద్యార్థిని మృతి!

క‌లం, వెబ్‌డెస్క్‌: ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) రాష్ట్రంలోని బలరాంపూర్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. స్కూల్ పక్కనే మోగిన డీజే శబ్దానికి (DJ Noise) ఓ రెండో తరగతి విద్యార్థిని ప్రాణాలు కోల్పోయింది. వైష్ణవి తివారీ అనే విద్యార్థిని రోజూలాగానే స్కూల్‌కు వెళ్లింది. అయితే వినాయ‌క నిమ‌జ్జ‌నాల సంద‌ర్భంగా వైష్ణ‌వి స్కూల్ ద‌గ్గ‌ర కూడా హ‌డావుడి నెల‌కొంది. మంగ‌ళ‌వారం ఉదయం స్కూల్‌ ఎదురుగా కొంత‌మంది గణేశ్ నిమజ్జన ఊరేగింపు నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా డీజేల‌ను భారీ శ‌బ్దాల‌తో మోగించారు. శ‌బ్దాలు తీవ్ర‌స్థాయిలో ప్రతిధ్వనించడంతో వైష్ణ‌వి తీవ్ర అస్వస్థతకు గురైంది.

క్లాస్ రూంలో సీసీటీవీ కెమెరాలలో రికార్డైన దృశ్యాల ప్రకారం డీజే శబ్దం రావడంతోనే చిన్నారి అకస్మాత్తుగా కుర్చీలో కుప్పకూలింది. శ‌బ్దాల‌కు వ‌రుస‌గా గుండెపోట్లు వ‌చ్చి చిన్నారి పరిస్థితి విషమించి మృతి చెందింద‌ని కుటుంబ‌స‌భ్యులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేప‌ట్టారు. పూర్తి విచారణ నివేదిక తర్వాతే అసలు కారణాలు స్పష్టమవుతాయని తెలిపారు. పండుగ పూట చిన్నారి మ‌ర‌ణంతో ఆ కుటుంబంలో విషాదం నెల‌కొంది. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>