కలం, వెబ్ డెస్క్: విక్టరీ వెంకటేశ్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో వస్తున్న ‘ఆదర్శ కుటుంబం – AK 47’ (Adarsha Kutumbam AK 47) మూవీ అక్టోబర్ 9న విడుదల కాబోతుంది. ముందు అక్టోబర్ రెండో తేదీనే వస్తున్నట్లు ప్రకటించిన.. వారం రోజులు ఆలస్యంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు మూవీ మేకర్స్ ప్రకటించారు. శ్రీనిధి శెట్టి, నివేదా పేతురాజ్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో నారా రోహిత్ కీలక పాత్ర పోషిస్తుండగా.. రావు రమేశ్, సత్య, బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నారు.
ఇటీవలే విడుదలైన మూవీ టీజర్‌కు మంచి స్పందన వచ్చింది. మధ్య తరగతి కుటుంబం నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో వెంకటేశ్ పాత్ర ఆద్యంతం ఆకట్టుకుంది. త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్, ఎమోషన్స్, యాక్షన్ అంశాలను మేళవించారు. చాలా ఏళ్ల తరువాత త్రివిక్రమ్–వెంకటేశ్ కాంబోలో వస్తుండటంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. దసరా కానుకగా థియేటర్లలో సందడి చేయబోతుంది.

