కలం, వెబ్ డెస్క్: వాయుగుండం ప్రభావంతో హైదరాబాద్ వ్యాప్తంగా భారీ వర్షాలు (Hyderabad Rains) పడుతున్నాయి. వాతావరణం ఒక్కసారిగా మారిపోవడంతో పలు ప్రాంతాల్లో వాన దంచికొడుతోంది. ఆఫీసుల నుంచి ఇళ్లకు చేరుకునే సమయం కావడంతో వర్షాల కారణంగా భారీగా ట్రాఫిక్ రద్దీ నెలకొంది. సికింద్రాబాద్, పంజాగుట్ట, ఖైరతాబాద్, చార్మినార్, చాంద్రాయణగుట్ట ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో హడలెత్తిస్తోంది. రాబోయే మూడు గంటల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ట్రాఫిక్ పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. బంజారాహిల్స్ ప్రాంతంలో రోడ్లు జలమయం అయ్యాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. అవసరం ఉంటే తప్ప బయటకు రావొద్దని సూచిస్తున్నారు. జీహెచ్ఎంసీ, హైడ్రా సిబ్బంది రంగంలోకి దిగి ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టారు.

