కలం, భువనగిరి : రైతుల సంక్షేమమే (Farmers Welfare) ధ్యేయంగా ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు పనిచేయాలని, అన్నదాతలకు మరింత మెరుగైన సేవలు అందించాలని భువనగిరి నియోజకవర్గ శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి (Kumbam Anil Kumar Reddy) పిలుపునిచ్చారు. పోచంపల్లి పట్టణంలోని ఓ గార్డెన్స్‌లో మంగళవారం నిర్వహించిన ‘పోచంపల్లి పీఏసీఎస్ అర్థ వార్షిక సర్వసభ్య సమావేశానికి’ ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఆయన తనయుడు, యువ నాయకులు కుంభం శ్రీరామ్ రెడ్డితో కలిసి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పీఏసీఎస్ నూతన చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన పాక మల్లేష్ యాదవ్, వైస్ చైర్మన్ కొట్టం కరుణాకర్ రెడ్డిలతో పాటు నూతన పాలకవర్గ సభ్యులకు ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి (Bhongir MLA) శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. రైతులకు అవసరమైన రుణాలు, ఎరువులు, విత్తనాలు సకాలంలో అందిస్తూ వారి సమస్యల పరిష్కారానికి నూతన పాలకవర్గం నిరంతరం కృషి చేయాలని సూచించారు. సొసైటీ అభివృద్ధికి, రైతాంగ సంక్షేమానికి తనవంతు పూర్తి సహకారాన్ని ఎల్లప్పుడూ అందిస్తానని ఆయన హామీ ఇచ్చారు.
సర్వసభ్య సమావేశంలో మున్సిపల్ చైర్మన్ తడక వెంకటేష్, వైస్ చైర్పర్సన్ కొయ్యడ రజిని-శ్రీనివాస్, వివిధ మండలాల పీఏసీఎస్ చైర్మన్లు కళ్లెం రాఘవరెడ్డి (జూలూరు), గరిసే రవి (వలిగొండ), పొట్టోళ్ళ శ్యామ్ గౌడ్ (బీబీనగర్), పక్కిర్ కొండల్ రెడ్డి (భువనగిరి) పాల్గొన్నారు. అలాగే పోచంపల్లి చేనేత సహకార సంఘం అధ్యక్షులు భారత లవకుమార్, కాంగ్రెస్ పార్టీ పోచంపల్లి పట్టణ అధ్యక్షులు వంగూరి పాండు, మండల అధ్యక్షులు ఉప్పునూతల వెంకటేష్, బీబీనగర్ మండల అధ్యక్షులు సూరకంటి సత్తిరెడ్డి, సీనియర్ నాయకులు మర్రి నర్సింహా రెడ్డి, గోలి నరేందర్ రెడ్డి, అంబరీష్ రెడ్డి, భూపాల్ రెడ్డి, కాసుల అంజయ్య, స్థానిక కౌన్సిలర్లు, సర్పంచులు, డైరెక్టర్లు, కో-ఆప్షన్ సభ్యులు, సీఈఓ బాల్ రెడ్డితో పాటు పెద్ద సంఖ్యలో రైతులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

