కిలాడి ఖైదీ.. పోలీసుల కన్నుగప్పి రెండోసారి పరార్

కలం, వెబ్ డెస్క్ : పోలీసుల కన్ను గప్పి ఓ రిమాండ్ ఖైదీ (Chanchalguda Remand Prisoner) పరార్ అయిన ఘటన కలకలం రేపింది. చంచల్‌గూడ కేంద్ర కారాగారంలో రిమాండ్ ఖైదీగా ఉన్న ఓ వ్యక్తి ఆసుపత్రి నుండి తప్పించుకుని పారిపోయాడు. వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం అమరచింత గ్రామానికి చెందిన శివశంకర్ రెడ్డి అనే వ్యక్తి చంచల్ గూడ జైలులో రిమాండ్ ఖైదీగా శిక్ష అనుభవిస్తున్నాడు. అయితే, అనారోగ్య కారణాలతో ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం జైలు సిబ్బంది శివశంకర్ రెడ్డిని ఎర్రగడ్డలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

చికిత్స పొందుతున్న సమయంలో భద్రతా సిబ్బంది కన్నుగప్పి ఆయన అక్కడి నుంచి చాకచక్యంగా తప్పించుకున్నాడు. కాగా, నిందితుడు శివశంకర్ రెడ్డికి ఇలాంటి ఘటనలు కొత్తేమీ కాదని, అతడు గతంలోనూ పోలీస్ కస్టడీ నుండి పారిపోయిన చరిత్ర ఉందని జైలు అధికారులు వెల్లడించారు. ఖైదీ పరారైన విషయం గుర్తించిన వెంటనే జైలు అధికారులు, స్థానిక పోలీసులు అప్రమత్తమయి నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>