నిర్మల్‌లో ఘనంగా మాజీ మంత్రి నర్సారెడ్డి జయంతి వేడుకలు

కలం, నిర్మల్: నిర్మల్ (Nirmal) జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ పీసీసీ అధ్యక్షుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి పి. నర్సారెడ్డి జయంతి (Narsa Reddy Jayanthi) వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. స్థానిక బస్టాండ్ సమీపంలోని నర్సారెడ్డి విగ్రహానికి కాంగ్రెస్ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా పీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంబడి రాజేశ్వర్ మాట్లాడుతూ.. నర్సారెడ్డి కాంగ్రెస్ పార్టీకి చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఆయన చేసిన కృషి, రాజకీయ జీవితంలో చూపిన విలువలు నేటి తరానికి ఆదర్శంగా నిలుస్తాయని పేర్కొన్నారు. నర్సారెడ్డి ఆశయాలను కొనసాగిస్తూ ప్రజా సేవలో ముందుకు సాగాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>