వినాయక నిమజ్జనం ఎఫెక్ట్ .. 572 మంది బైండొవర్ !

కలం, నిజామాబాద్ బ్యూరో : వినాయక నిమజ్జనం కార్యక్రమం ప్రశాంత వాతావరణంలో, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా నిర్వహించేందుకు నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ (Nizamabad Police Commissionerate) పరిధిలో పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఆదేశాలతో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే అవకాశం ఉన్న వ్యక్తులను ముందస్తుగా గుర్తించి పోలీసు అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం సంబంధిత మండల రెవెన్యూ అధికారులు (తహసీల్దార్లు/MROలు) ఎదుట హాజరుపరిచి, చట్టపరమైన నిబంధనల ప్రకారం బైండోవర్ చర్యలు చేపట్టారు.

వినాయక నిమజ్జనం సందర్భంగా ఎలాంటి గొడవలు ఘర్షణలు అల్లర్లు లేదా ఇతర అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీస్ అధికారులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. నిమజ్జన మార్గాలు, ప్రధాన కూడళ్లు, సున్నితమైన ప్రాంతాలు రద్దీ ప్రదేశాల్లో పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేసి, నిరంతరం పర్యవేక్షణ చేపడుతున్నారు. అలాగే నిమజ్జన కార్యక్రమంలో పాల్గొనే ప్రతి ఒక్కరూ శాంతియుతంగా, క్రమశిక్షణతో, పరస్పర సహకారంతో వ్యవహరించాలని పోలీసులు సూచించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడితే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>