కలం, వెబ్ డెస్క్: యూపీఐ చెల్లింపుల (UPI Payments)పై కేంద్ర ప్రభుత్వం మరోసారి కీలక ప్రకటన చేసింది. యూపీఐ వ్యవస్థపై ఎలాంటి అపోహలు వద్దని, వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. చిన్న వ్యాపారులపై ఎలాంటి భారం ఉండబోదని వెల్లడించింది. రూ.2 వేల వరకు యూపీఐ చెల్లింపులపై ఎలాంటి ఛార్జీలు, జీఎస్టీ విధింపులు ఉండవని స్పష్టం చేసింది. మెజార్టీ డిజిటల్ చెల్లింపులకు అసలు మర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR) వర్తించదని వివరించింది. ఎండీఆర్‌ను జీఎస్టీ చెల్లింపుల్లో సర్దుబాటు అవుతుంటుందని పేర్కొంది. ఎలాంటి అవాస్తవ ప్రచారాలను నమ్మవద్దని.. యూపీఐ చెల్లింపులు రాబోయే రోజుల్లో మరింత ఖరీదవుతాయనే ప్రచారాన్ని కూడా ఖండించింది.
కొత్త నిబంధనలు అమల్లోకి రావడంతో…
అక్టోబర్ 15వ తేదీ నుంచి యూపీఐ చెల్లింపులపై (UPI Payments) కొత్త నిబంధనలు అమల్లోకి వస్తుండటంతో వినియోగదారుల్లో సందేహాలు వ్యక్తమవుతున్నాయి. రూ.2 వేలు దాటిన చెల్లింపులపై మర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR) విధిస్తారనడమే దీనికి ప్రధాన కారణం. అయితే ఇది కేవలం వ్యాపారులకే.. అది కూడా నిర్ధిష్ట టర్నోవర్ ఉన్నవారికే వర్తిస్తుందని పేర్కొంది. అంతే తప్ప సామాన్య వినియోగదారులకు ఎలాంటి భారం ఉండదని స్పష్టం చేసింది. అయినా వదంతులు ఆగకపోవడంతో కేంద్ర ప్రభుత్వం అవగాహన కల్పిస్తోంది.
Also Read : బండ్లగూడ ఆర్టీవోలో అనుమానాస్పద ట్రాన్సాక్షన్లు!
Follow Us On: X(Twitter)

