కలం, జగిత్యాల: ఈనెల 27 నుండి 30 వరకు మహారాష్ట్రలోని శంభోజి నగర్ లో జరగనున్న జాతీయస్థాయి పోటీలకు జగిత్యాల జిల్లా వాసి ఎంపికయ్యాడు. భీమారం మండలం గోవిందారం (Govindaram) గ్రామంలోని జెడ్పీ స్కూల్ లో 9వ తరగతి చదువుతున్న బండపల్లి జశ్వంత (Bandapalli Jaswanth) సెలెక్ట్ అయ్యారు. ఈ నెల 19 నుండి 22 వరకు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో జరిగిన రాష్ట్రస్థాయి సాఫ్ట్ వాల్ పోటీలలో జశ్వంత గెలుపొందారు. ఈ సందర్భంగా జస్వంత్ ను జిల్లా విద్యాధికారి రాము అభినందించారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు అస్వాక్ హుస్సేన్, ఫిజికల్ డైరెక్టర్ ప్రశాంత్, పీఆర్టీయూ టీఎస్ జగిత్యాల జిల్లా శాఖ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు యళ్ళ అమర్నాథ్ రెడ్డి, బోయిని పెల్లి ఆనంద్ రావు, సాప్ట్ బాల్ జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటేష్, జిల్లా అకాడమీ అధికారి చంద్రశేఖర్ రెడ్డి, స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ జిల్లా కార్యదర్శి చక్రధర్ రావు, మాజీ కార్యదర్శి లక్ష్మి రామ్ నాయక్, తదితరులు పాల్గొన్నారు.
Also Read : చేతకానితనాన్ని ఎల్‌నినో మీద పెడుతున్న రేవంత్.. హరీశ్ రావు ఫైర్
Follow Us On: X(Twitter)

