ఇంటిగ్రేటెడ్ పనులు వేగవంతం చేయాలి : పొంగులేటి !

కలం, ఖమ్మం బ్యూరో : ఖమ్మం జిల్లా ఏదులాపురం మున్సిపాలిటీ ప్రజలకు వివిధ ప్రభుత్వ శాఖల సేవలను ఒకే చోట, సులభంగా అందించడమే లక్ష్యంగా చేపట్టిన ఇంటిగ్రేటెడ్ కార్యాలయాల భవన నిర్మాణ పనులను వేగవంతం చేయాలని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Ponguleti Srinivas Reddy) అధికారులను ఆదేశించారు. ​వరంగల్ క్రాస్ రోడ్డు సమీపంలోని తరుణీ హాట్ ప్రాంగణంలో జరుగుతున్న ఈ భవన నిర్మాణ పనులను మంగళవారం మంత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు.

నాణ్యతలో రాజీ వద్దు

ఈ సందర్భంగా ఆయన పనుల పురోగతిని పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. భవన నిర్మాణ పనుల(Integrated Office Building) నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడకూడదని, నిర్దేశిత సమయంలోగా పనులన్నీ పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని మంత్రి స్పష్టం చేశారు. ఈ సమగ్ర భవన సముదాయం అందుబాటులోకి వస్తే పాలనా సేవలు మరింత సులభతరమై, ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని పేర్కొన్నారు. ​ఈ తనిఖీ కార్యక్రమంలో ఏదులాపురం మున్సిపల్ చైర్‌పర్సన్ పోకబత్తిని అనితతో పాటు పలువురు స్థానిక నాయకులు, ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>