అన్నదానంలో విషాదం: సాంబార్ పాత్రలో పడిన మహిళ

కలం, వెబ్ డెస్క్ : విజయవాడ (Vijayawada)లో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన అన్నదానం కార్యక్రమంలో తీవ్ర ప్రమాదం జరిగింది. భక్తులకు వడ్డించేందుకు సిద్ధంగా ఉంచిన వేడి వేడి సాంబార్ పాత్రలో ప్రమాదవశాత్తు పడి సుజాత (46) అనే మహిళ తీవ్రంగా గాయపడింది.

అన్నదాన కార్యక్రమంలో సహాయం అందిస్తున్న సమయంలో ఊహించని విధంగా ఆమె కాలు జారి వేడి సాంబార్ పాత్రలో పడిపోయినట్లు ప్రత్యక్షసాక్షులు తెలిపారు. వెంటనే గమనించిన స్థానికులు, నిర్వాహకులు ఆమెను బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు. అయితే, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో ఆమె మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు.

Also Read : మాజీ మంత్రి అంబటి రాంబాబుపై కేసు నమోదు

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>