కలం, జడ్చర్ల : జురాల ప్రాజెక్టు (Jurala Project) వద్ద నీటి విడుదల కోసం ఆందోళన చేపడుతున్న రైతులకు మద్దతుగా వెళ్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావును (Ramchander Rao) జడ్చర్ల పోలీసులు మార్గమధ్యంలోనే అరెస్టు చేశారు. రైతుల ధర్నాకు మద్దతు తెలిపేందుకు ఆయన వెళ్తుండగా పోలీసు బలగాలు అడ్డుకుని అదుపులోకి తీసుకున్నాయి.
సర్కారు రైతుల డిమాండ్లను పట్టించుకోకుండా అణచివేత చర్యలకు పాల్పడుతోందని నేతలు మండిపడ్డారు. రైతుల డిమాండ్లపై ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని బీజేపీ నాయకులు కోరారు. నీటి విడుదల అంశంలో రైతులకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతుందని వారు తెలిపారు. పలువురు కార్యకర్తలను కూడా పోలీసులు ముందస్తుగా అరెస్టు చేసి సమీప స్టేషన్లకు తరలించారు.
Also Read : జూరాల నీటి కోసం బీజేపీ పోరు.. నేతల హౌస్ అరెస్ట్‌పై డీకే అరుణ ఫైర్!
Follow Us On : WhatsApp

