పిడుగుపాటుకు యువకుడు మృతి

కలం, జోగులాంబ గద్వాల: పిడుగుపాటుకు యువకుడు మృతి చెందిన ఘటన సోమవారం కేటి దొడ్డి మండలం యర్సన్ దొడ్డి (Yarsan Doddi) గ్రామంలో చోటు చేసుకుంది. కుర్వ లక్ష్మి, ఎంకప్ప దంపతుల ఏకైక కుమారుడు మల్లేష్ (18) వ్యవసాయ పనులు ముగించుకుని ఇంటికి వెళ్తున్నాడు. అదే సమయంలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం రావడంతో సమీపంలోని ఆలయం వద్ద ఉన్న చెట్టు కింద నిలబడ్డాడు. ఈ క్రమంలో చెట్టు మీద పిడుగుపడటంతో మల్లేష్ అక్కడికక్కడే మరణించాడు. ఒక్కానొక్క కుమారుడు మృతి చెందడంతో కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>