కలం, మహబూబ్ నగర్ బ్యూరో: మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఆవరణలో వినాయక మండపం వద్ద జిల్లా నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో కలెక్టర్ ఖుష్బూ గుప్తా (Khushbhoo Gupta) పాల్గొన్నారు. గణపతి విగ్రహానికి కలెక్టర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదానం కార్యక్రమంలో స్వయంగా భక్తులకు వడ్డించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. విగ్రహాల నిమజ్జనానికి ఏర్పాట్లను పూర్తి చేశామన్నారు. వర్షాబావ పరిస్థితుల వలన నీటి కుంటలు, చెరువులు ఎండిపోయినందున బేబీ కుంటలను ఏర్పాటు చేశామని అన్నారు. రెవెన్యూ అదనపు కలెక్టర్ జె.ఎల్.బి. హరిప్రియ, ట్రైనీ అసిస్టెంట్ కలెక్టర్ సాయి శివాని, జిల్లా నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం అధ్యక్షులు నరేందర్ తదితరులు పాల్గొన్నారు.

