వికలాంగుల డిమాండ్లపై యాదాద్రి కలెక్టరేట్ ముట్టడి

కలం, యాదగిరిగుట్ట: వికలాంగుల సమస్యలను పరిష్కరించాలని, ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ యాదాద్రి భువనగిరి (Yadadri Bhuvanagiri) జిల్లా కలెక్టరేట్‌ను వికలాంగుల ఐక్య సంఘాల ఆధ్వర్యంలో ముట్టడించారు. ఐక్య సంఘాల నాయకుడు కోడిదెల నరేష్ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో వికలాంగులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి BVHPS రాష్ట్ర అధ్యక్షుడు( BVHPS Chief) గిద్దె రాజేష్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వికలాంగుల పింఛన్‌ను రూ.6,000కు పెంచాలని, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న వికలాంగుల బ్యాక్‌లాగ్ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని కోరారు. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో వికలాంగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని అన్నారు.

RPwD Act, 2016ను సమర్థవంతంగా అమలు చేయాలని, వికలాంగుల సంక్షేమ శాఖను మహిళా, శిశు సంక్షేమ శాఖ నుంచి వేరు చేసి ప్రత్యేక శాఖ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో వికలాంగులకు ప్రత్యేక రాజకీయ రిజర్వేషన్ కల్పించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. వికలాంగుల ఎన్నికల హామీలను అమలు చేయకపోతే భువనగిరి నుంచే ఐక్య ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని గిద్దె రాజేష్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాజీ ప్రభుత్వ విప్ గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి, జిజేపీ దివ్యాంగుల సెల్ రాష్ట్ర కో-కన్వీనర్ గొల్లి ప్రభాకర్, NPRD India వ్యవస్థాపక అధ్యక్షుడు తుడుం రాజేందర్, రాష్ట్ర అధ్యక్షుడు దైనంపల్లి మల్లిఖార్జున్, ఐక్య సంఘాల నాయకులు మచ్చ ఉపేందర్, అనంతుల ఎల్లారెడ్డి, సింగారం రమేష్, జాగిలపురం అయిలయ్య, బండారి శివకుమార్, సిద్ధారెడ్డి, గుజ్జ అశోక్, గోగు యాదయ్య, ఆకుల సత్తయ్య తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>