కలం, వెబ్‌డెస్క్: టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun), ప్రముఖ దర్శకుడు అట్లీ కాంబినేషన్లో వస్తోన్న మోస్ట్ అవేటెడ్ మూవీ ‘రాకా’ (Raaka) అంతర్జాతీయ స్థాయిలో సరికొత్త చరిత్ర సృష్టించింది. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే ఓ అరుదైన ఘనత సాధించి గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించుకుంది. ఏకకాలంలో రియల్ టైమ్‌లో అత్యధిక మందికి మోషన్ క్యాప్చర్ నిర్వహించిన విభాగంలో ఈ వరల్డ్ రికార్డు నమోదైంది. ఈ చిత్ర నిర్మాణంలో భాగంగా ఏకకాలంలో ఏకంగా 37 మంది ఆర్టిస్టులపై ఒకే సింగిల్ మోషన్ క్యాప్చర్ సెషన్లో ఈ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఈ రికార్డు సాధించగా తాజాగా సెప్టెంబర్ 15న గిన్నిస్ సంస్థ దీనిని అధికారికంగా ధృవీకరించింది.
ఈ రికార్డుకు సంబంధించిన సర్టిఫికెట్‌ను గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ప్రతినిధి స్వప్నిల్ డాంగ్రికర్ హీరో అల్లు అర్జున్, డైరెక్టర్ అట్లీ(Director Atlee)కి అందజేశారు. ఈ కార్యక్రమంలో సినిమా (Raaka) యూనిట్ సభ్యులు కూడా పాల్గొన్నారు. ఈ మోషన్ క్యాప్చర్‌లో 4 సంవత్సరాల చిన్నారి నుంచి 70 ఏళ్ల వృద్ధుడి వరకు వివిధ వయసుల వారు పాల్గొన్నారు. 37 మంది వ్యక్తుల విభిన్న హావభావాలు, నటనను ఒకే వాల్యూమ్‌లో ఏకకాలంలో రికార్డు చేయడం నిజంగా ఓ పెద్ద సవాల్. దీనికోసం చిత్ర యూనిట్‌లోని వీఎఫ్ఎక్స్ నిపుణులు ఒక ప్రత్యేకమైన టెక్నికల్ వర్క్‌ఫ్లోను డిజైన్ చేశారు. సరిగ్గా 92 ఆప్టికల్ మోషన్ క్యాప్చర్ కెమెరాలతో పాటు, రియల్ టైమ్ అన్-రియల్ విజువలైజేషన్, ఫేషియల్ క్యాప్చర్ సిస్టమ్స్‌ను ఉపయోగించి ఈ భారీ ప్రయోగాన్ని పూర్తి చేశారు.
ఈ గిన్నిస్ రికార్డు సాధించడం పట్ల హీరో అల్లు అర్జున్ ఆనందం వ్యక్తం చేశారు. ఇది గ్లోబల్ స్థాయిలో సినిమా హద్దులను చెరిపేసి కొత్త బెంచ్‌మార్క్‌ను సృష్టిస్తుందని, సన్ పిక్చర్స్ సహకారంతో ఈ భారీ ప్రాజెక్ట్‌ను ముందుకు తీసుకెళ్లడం చాలా ప్రత్యేకంగా ఉందని తెలిపారు. దర్శకుడు అట్లీ మాట్లాడుతూ.. చిన్నతనంలో గిన్నిస్ రికార్డుల గురించి వినేవాళ్లమని, స్వయంగా మనమే ఆ రికార్డును సాధించడం మాటల్లో చెప్పలేని అనుభూతి అని, తన కల నిజం కావడానికి కృషి చేసిన టీమ్ అందరికీ కృతజ్ఞతలు తెలిపారు.
Also Read : రూ.46 కోట్ల మోసం.. పోలీసులను ఆశ్రయించిన నటి రాధ
Follow Us On : WhatsApp

