కలం, యాదగిరిగుట్ట: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా ప్రజా జీవితంలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ‘సేవా సంకల్ప్ అభియాన్’(Seva Sankalp Abhiyan) కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు (Ramchander Rao) తెలిపారు. అభియాన్లో భాగంగా దేశవ్యాప్తంగా వివిధ సేవా కార్యక్రమాలతో పాటు రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నట్లు యాదాద్రి భువనగిరి జిల్లా బీజేపీ అధ్యక్షుడు ఉట్కూరి అశోక్ గౌడ్ తెలిపారు. ఇందులో భాగంగా బీజేవైఎం ఆధ్వర్యంలో యాదగిరిగుట్టలో(Yadagirigutta) రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రామచందర్ రావు హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 17 వరకు నెల రోజుల పాటు ‘సేవా సంకల్ప్ అభియాన్ (Seva Sankalp Abhiyan)’ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడంతో పాటు వివిధ సేవా కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపడుతున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శులు అచ్చయ్య, మహేందర్, మాజీ అధ్యక్షులు పాశం భాస్కర్, దశరథ, రచ్చా శ్రీనివాస్, పట్టణ అధ్యక్షుడు కర్రే ప్రవీణ్, జిల్లా ఎగ్జిక్యూటివ్ సభ్యుడు బెల్దే అశోక్, జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు మాధురి తదితరులు పాల్గొన్నారు.
Also Read : తెలంగాణ సర్కార్కు ఎన్హెచ్ఆర్సీ నోటీసులు!
Follow Us On : WhatsApp

