నిమజ్జనానికి నీటి విడుదలపై కాంగ్రెస్ వైఖరి దుర్మార్గం : ప్రవీణ్ రావు

కలం, కరీంనగర్: కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో గణేశ్ నిమజ్జనానికి ప్రాజెక్టుల నుంచి నీటిని విడుదల చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం హిందూ వ్యతిరేక వైఖరి అవలంబిస్తోందని బిజెపి కరీంనగర్ పార్లమెంట్ కన్వీనర్ బోయినపల్లి ప్రవీణ్ రావు (Boinpally Praveen Rao) తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సోమవారం కరీంనగర్ పార్లమెంట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వినాయక నిమజ్జనం కోసం ఎస్సారెస్పీ, మిడ్ మానేరు, ఎల్‌ఎండీ కాలువలకు నీటిని విడుదల చేయాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ విజ్ఞప్తి చేసినా, ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లినా ప్రభుత్వం స్పందించలేదన్నారు.

బిజెపి ఆధ్వర్యంలో చేపట్టిన ‘చలో చింతకుంట’ భారీ ఆందోళన ఫలితంగానే రేవంత్ రెడ్డి ప్రభుత్వం దిగొచ్చి కాలువలకు నీటిని విడుదల చేసిందని, ఇది హిందువుల విజయమని ప్రవీణ్ రావు పేర్కొన్నారు. ఇతర మతాల పండుగలకు నిధులు కేటాయించే ప్రభుత్వం, హిందూ పండుగలపై ద్వేషం చూపుతోందని ఆయన విమర్శించారు. ఎస్సారెస్పీలో 40 టీఎంసీలకు పైగా నీళ్లు ఉన్నప్పటికీ నిమజ్జనానికి నీరు ఇవ్వకపోవడం దుర్మార్గమన్నారు.

నీటి విడుదల అంశంపై కరీంనగర్‌కు చెందిన ఓ కాంగ్రెస్ నాయకుడు చేస్తున్న రాజకీయ వ్యాఖ్యలను తీవ్రంగా ప్రవీణ్ రావు ఖండించారు. నీటి విడుదలపై ఇరిగేషన్ మంత్రి నుంచి గానీ, ప్రభుత్వం నుంచి గానీ అధికారిక ప్రకటన ఉందా అని ఆయన (Boinpally Praveen Rao) ప్రశ్నించారు. ఈ సమావేశంలో కార్పొరేటర్లు బండ రమణారెడ్డి, మేకల వెంకటేష్, ఎన్నం ప్రకాష్, బీజేవైఎం రాష్ట్ర ఉపాధ్యక్షులు నరేడ్ల ప్రవీణ్ రెడ్డి, ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి రాజు అడిచెర్ల తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>