సాగు నీటి కోసం కదం తొక్కిన రైతులు

కలం, జోగులాంబ గద్వాల: ఎండిపోతున్న పంటలను కాపాడుకోవడానికి జూరాల ప్రాజెక్టు (Jurala Project) నుంచి నీటి విడుదల కోసం ఉమ్మడి మహబూబ్‌నగర్‌ రైతులు కదం తొక్కారు. అమరచింత మండల పరిధిలోని జూరాల ఎడమ కాలువ వద్దకు రైతులు వెళ్లకుండా పోలీసులను భారీగా మోహరించారు. ఈ క్రమంలో రైతులపై పోలీసులు లాఠీఛార్జి కూడా చేయడంతో ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తాయి.

సాగు నీరు విడుదల చేయాలని నిరసిస్తూ రైతులు ప్రాణాలను సైతం లెక్కచేయకుండా సమాంతర కాలువలోకి దిగి, జూరాల ఎడమ కాలువ రెగ్యులేటర్ వైపు నడుచుకుంటూ వెళ్లేందుకు ప్రయత్నించారు. పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారడంతో పోలీస్ బలగాలు జూరాల ప్రాజెక్టును పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. రహదారులపై అడ్డంకులు ఏర్పాటు చేశారు. దీంతో పొలాల వెంబడి కిలోమీటర్ల మేర నడుచుకుంటూ ప్రాజెక్టు వద్దకు చేరుకున్నారు.

శ్రీశైలం ప్రాజెక్టులో 100 టీఎంసీలున్నా..

ఒక్క జూరాల ప్రాజెక్ట్ నుంచి మాత్రమే కాకుండా కోయిల్ సాగర్, సంగంబండ రిజర్వాయర్ల కింద కాలువలకు వెంటనే నీటిని విడుదల చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు శ్రీశైలం ప్రాజెక్టులో దాదాపు 100 టీఎంసీల నీరు ఉన్నా ప్రభుత్వం నీటిని ఎత్తిపోయకుండా వదిలేయడంతో ఆంధ్ర ప్రాంతానికి వెళ్లిపోతోందని మండిపడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం, ఇరిగేషన్ అధికారులు సాగునీటి విడుదలపై ఎలాంటి స్పష్టమైన నిర్ణయం తీసుకోకపోవడంతో రైతుల్లో అసహనం, ఆందోళన మరింత తీవ్రమవుతున్నాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>