కలం, యాదగిరిగుట్ట: దివ్యాంగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని బీఆర్ఎస్ నాయకురాలు గొంగిడి సునీత (Gongidi Sunitha) అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ ఎదుట దివ్యాంగుల సమస్యల పరిష్కారం కోసం దివ్యాంగులు నిర్వహించిన మహాధర్నా కార్యక్రమంలో ఆమె పాల్గొని మద్దతు తెలిపారు. అనంతరం దివ్యాంగులతో కలిసి అడిషనల్ కలెక్టర్లు భాస్కర్ రావుకు, వెంకటరెడ్డి లకు వినతిపత్రం అందజేశారు. దివ్యాంగుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, వాటి పరిష్కారానికి తన వంతు అండగా ఉంటానని గొంగిడి సునీత హామీ ఇచ్చారు.

