లక్ష్మణచాంద మండల అభివృద్ధిపై ఎమ్మెల్యే సమీక్ష

కలం, లక్ష్మణచాంద: లక్ష్మణచాంద (Laxmanchanda) మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన మండల స్థాయి సమీక్ష సమావేశానికి బీజేఎల్పీ నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి (Alleti Maheshwar Reddy) హాజరయ్యారు. ఈ సందర్భంగా మండలంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులు, ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాలు, స్థానికంగా నెలకొన్న సమస్యలపై అధికారులతో సమీక్షించారు. మండలంలో చేపట్టిన అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరేలా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. సమావేశంలో తహసీల్దార్, ఎంపీడీఓతో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>