ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారంపై కలెక్టర్ సమీక్ష

కలం, ఆదిలాబాద్: ప్రజావాణికి వచ్చే దరఖాస్తులను(Prajavani Applications) పెండింగ్‌లో ఉంచకుండా నిర్దేశిత గడువులోగా త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా (Collector Rajarshi Shah) అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి, అవసరమైతే క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి సత్వర పరిష్కారం చూపాలని అధికారులకు సూచించారు. శాఖల వారీగా పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను సమీక్షించి, పరస్పర సమన్వయంతో పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజలకు సత్వర న్యాయం అందేలా అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలని పేర్కొన్నారు.

మరోవైపు వికలాంగులకు కోటా కంటే అధికంగా డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు కేటాయించడంతో పాటు ప్లంబింగ్, నీటి సరఫరా, వీధి దీపాల సమస్యలను సత్వరం పరిష్కరించినందుకు హ్యాండిక్యాప్ హెల్పింగ్ వెల్ఫేర్ సొసైటీ ప్రతినిధులు కలెక్టర్ రాజర్షి షా(Collector Rajarshi Shah)కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ను శాలువాతో సత్కరించి, ఆయన చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.

Also Read : సిలబస్ మార్పులపై టీజీపీఎస్సీ కీలక ప్రకటన

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>