కలం, వెబ్‌డెస్క్: ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి పలువురి వద్ద డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న యూట్యూబర్ నందన (YouTuber Nandana) వ్యవహారంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆమెపై ఆరోపణలు చేస్తూ పలువురు తెలంగాణ ప్రజావాణిని ఆశ్రయించారు. బేగంపేట ప్రజాభవన్‌లో ప్రజావాణి ఇన్చార్జ్ గద్వాల విజయలక్ష్మి, అధికారులకు ఫిర్యాదు చేశారు. యూకేలో ఫ్యామిలీతో స్థిరపడ్డ నందన, ఆమె భర్త మధుకర్‌లు ఉద్యోగాలు, వీసాల పేరిట తమను మోసం చేశారని ఫిర్యాదుల్లో పేర్కొన్నారు.
యూకే ప్రభుత్వం తమ కంపెనీకి ఉద్యోగులను నియమించుకునే అనుమతి ఇచ్చిందని చెప్పి, స్టూడెంట్, విజిటర్ వీసాలపై యూకే (UK) వెళ్లిన వారికి ఉద్యోగ వీసాలు ఇప్పిస్తామని చెప్పినట్లు వెల్లడించారు. ఇలా ఒక్కొక్కరి నుంచి రూ.25 లక్షల నుంచి రూ.95 లక్షల వరకు వసూలు చేశారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ కన్సల్టెన్సీ సంస్థ సమర్పించిన డాక్యుమెంట్స్ నకిలీవి అని తేలడంతో యూకేలో పలువురు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు తెలిపారు. మోసపోయిన వారిలో తెలంగాణ నుంచి వికారాబాద్, జగిత్యాల, నిజామాబాద్‌తో పాటు పలువురు ఏపీ, గుజరాత్ రాష్ట్రాలకు చెందిన వారు కూడా ఉన్నట్లు తెలిపారు. ఈ విషయంపై డీజీపీ, ఈడీకి ఫిర్యాదు చేయాలని అధికారులు బాధితులకు సూచించారు. తప్పకుండా తమకు న్యాయం చేసేందుకు సహకరిస్తామని హామీ ఇచ్చారు.
Also Read : ఐఐటీలో విద్యార్థి ఆత్మహత్య.. కులం వేధింపులే కారణమా?
Follow Us On: X(Twitter)

