కలం, నిజామాబాద్ బ్యూరో: నిజామాబాద్ నగరంలో ఏసీబీ దాడులు కలకలం రేపాయి. మున్సిపల్ కార్పొరేషన్‌లో (Nizamabad Corporation) ఇద్దరు ఉద్యోగులను లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఎస్టాబ్లిష్‌మెంట్ సెక్షన్ జూనియర్ అసిస్టెంట్ పాల్ద అశోక్, ఆడిట్ సెక్షన్ అవుట్‌సోర్సింగ్ ఉద్యోగి కలకుంట్ల కిరణ్ కుమార్‌ను అదుపులోకి తీసుకున్నారు. నిజామాబాద్ నగరంలోని సీతారాం నగర్ కాలనీలోని పద్మశాలి సంఘం వద్ద ఇద్దరు లంచం డబ్బులు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
తన తల్లి సర్వీస్ బుక్‌లో ఇంక్రిమెంట్ ప్రొసీడింగ్స్ సిద్ధం చేసి నెలవారీ పింఛన్ మంజూరు చేయాలని ఓ వ్యక్తి వీరిని సంప్రదించారు. ఇందు కోసం రూ.15 వేలు లంచం డిమాండ్ చేశారు. దీంతో సదరు వ్యక్తి నిజామాబాద్ రేంజ్ ఏసీబీ అధికారులను సంప్రదించారు. అనంతరం పక్కాగా ట్రాప్ చేసి.. ఆ డబ్బులు తీసుకుంటుండగా ఇద్దరిని పట్టుకున్నారు. అనంతరం వీరిని అరెస్ట్ చేసి నాంపల్లిలోని ఏసీబీ కోర్టులో హాజరు పర్చేందుకు హైదరాబాద్ తరలించారు.
Also Read : నీళ్ల కోసం అదనపు కలెక్టర్ కాళ్లపై పడి వేడుకోలు
Follow Us On: X(Twitter)

