కలం, నిర్మల్: నిర్మల్ జిల్లా కేంద్రంలో ఈనెల 24న నిర్వహించనున్న గణేష్ నిమజ్జన శోభాయాత్రను (Ganesh Immersion) ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని బీజేఎల్పీ నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి (Alleti Maheshwar Reddy) సూచించారు. సోమవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘ భవనంలో గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో పట్టణంలోని గణేష్ మండపాల నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే (Alleti Maheshwar Reddy) మాట్లాడుతూ.. నిమజ్జన శోభాయాత్ర సందర్భంగా మండపాల నిర్వాహకులు, భక్తులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. చెరువులు, విద్యుత్ వైర్ల వద్ద ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. శోభాయాత్ర మార్గంలో ఉన్న గుంతల రోడ్లు, విద్యుత్ సమస్యలను అధికారులు వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా పోలీస్ శాఖ అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే సూచించారు. మండపాల నిర్వాహకులకు ఏవైనా సమస్యలు ఎదురైతే తన దృష్టికి తీసుకురావాలని కోరారు.
Also Read : నీళ్ల కోసం అదనపు కలెక్టర్ కాళ్లపై పడి వేడుకోలు
Follow Us On: X(Twitter)

