కలం, వెబ్ డెస్క్: కోతి అనగానే చాలామంది ఒకింత భయం. ఏవైపు నుంచి వచ్చి దాడి చేస్తుందో కూడా తెలియదు. కానీ ఓ బార్బర్ మాత్రం కోతిని కుర్చీలో పడుకోబెట్టి, ఏకంగా మసాజ్ చేసి ఆశ్చర్యపర్చాడు. ఆహారం కోసం తిరుగుతూ అలసిపోయిందో ఏమో.. ఆ కోతి సెలూన్‌లోకి వెళ్లి కుర్చీలో కూర్చుంది. బార్బర్ కూడా భయపడలేదు. పైగా దానికి మసాజ్ చేయడంతో.. కోతి కళ్లు మూసుకుని రిలాక్స్ అయ్యింది. మనుషులు ఏవిధంగా మసాజ్ చేయించుకుంటారో, అలాగే చేయించుకుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ ఫన్నీ వీడియోను నాగాలాండ్ (Nagaland) మంత్రి టెమ్జెన్ ఇమ్నా అలాంగ్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. “మంకేశ్ భాయ్ మసాజ్ ఎంజాయ్ చేస్తున్నారు.. డిస్టర్బ్ చేయకండి” అంటూ ఆయన చేసిన కామెంట్ నెటిజన్లను ఆకట్టుకుంటోంది.
🐒 సెలూన్లో కుర్చీలో కూర్చున్న కోతికి బార్బర్ మసాజ్.. కళ్లు మూసుకుని మరీ రిలాక్స్ అయిన ‘మంకేశ్ భాయ్’! 😂
నాగాలాండ్ మంత్రి టెమ్జెన్ ఇమ్నా అలాంగ్ షేర్ చేసిన ఈ ఫన్నీ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 😍
🐒 A barber gives a monkey a relaxing massage at a salon,… pic.twitter.com/AK5Pq2BA9c
— Kalam Daily (@kalamtelugu) September 21, 2026
Also Read : గోల్స్ వర్షం.. రికార్డు మ్యాచ్‌తో భారత్ జోరు!
Follow Us On : WhatsApp

