కలం, వెబ్ డెస్క్: ఏపీలో జూనియర్ డాక్టర్ల స్టైపెండ్ (Junior Doctors Stipend) పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఎంబీబీఎస్, బీడీఎస్ హౌస్ సర్జన్లకు 10 శాతం,పేజీలకు 5 శాతం, సూపర్ స్పెషలిటీకి 3.5 శాతం ఉపకార వేతనం పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయంతో రాష్ట్ర ప్రభుత్వంపై 34.08 కోట్ల అదనపు భారం పడనుంది. ఎంబీబీఎస్, బీడీఎస్ లకు జనవరి 1, 2026 నుంచి రూ.28,497 స్టైపెండ్ పెంచనున్నారు.
రాష్ట్రంలో గతకొద్ది రోజులుగా జూనియర్ డాక్టర్లు తమ ఉపకార వేతనం పెంచాలని నిరసన కార్యక్రమాలు చేశారు. సీనియర్ వైద్యులతో సమానంగా డ్యూటీ చేస్తున్నా.. తమకు జీతాలు పెంచడం లేదని, వెంటనే తమ వేతనాన్ని, స్టైపెండ్ పెంచాలని డిమాండ్ చేశారు. జూడాల నిరసనతో చర్యలు చేపట్టిన వైద్యారోగ్య శాఖ.. పలుమార్లు సమీక్షలు నిర్వహించి తాజాగా ఈ నిర్ణయం వెల్లడించింది.

