బస్సుల కొరతపై విద్యార్థులు ఆగ్రహం.. రోడ్డుపై బైఠాయింపు!

కలం, మెదక్ బ్యూరో: సంగారెడ్డి (Sangareddy) జిల్లా మనూరు మండలం బెల్లాపూర్ (Bellapur) గ్రామం వద్ద విద్యార్థులు రోడ్డుపై బైఠాయించి ధర్నా (Student Protest) చేపట్టారు. పాఠశాలలు, కళాశాలలకు వెళ్లేందుకు సమయానికి బస్సులు రావడం లేదంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రతిరోజూ బస్సుల కోసం గంటల తరబడి బస్ స్టాప్‌లోనే వేచి చూడాల్సి వస్తోందని, దీనివల్ల సకాలంలో తరగతులకు హాజరు కాలేకపోతున్నామని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. రవాణా సౌకర్యం సరిగా లేక తమ చదువు దెబ్బతింటోందని వాపోయారు. ఆర్టీసీ అధికారులు స్పందించి బస్సులను సక్రమంగా, టైం ప్రకారం నడపాలని, అదనపు సర్వీసులను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>