చివరిదశకు శ్రీవారి బ్రహ్మోత్సవాలు

కలం, వెబ్ డెస్క్: ప్రముఖ పుణ్యక్షేత్రంతిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో సెప్టెంబర్‌ 15 నుంచి మొదలైన శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు (Tirumala Brahmotsavam) అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. లక్షాలాది భక్తజన సందోహం నడుమ వేద పండితుల మంత్రోచ్చారణ నడుమ బ్రహ్మాండనాయకుడి బ్రహ్మోత్సవాలు సాగుతున్నాయి. తొలిరోజు నుంచి పలు అలంకారాల్లో తిరుమాడ వీధుల్లో దర్శనం మిచ్చిన శ్రీవారు.. ఆగస్టు 20 ఆదివారం ఉదయం హనుమంత వాహన సేవ వైభవంగా జరిగింది.

సాయంత్రం 4 గంటలకు స్వర్ణ రథ సేవ, రాత్రి 7 గంటలకు గజవాహనంపై ఊరేగింపు ఘనంగా సాగింది. ఆగస్టు 21 సోమవారం రోజున ఉదయం 8 గంటలకు సూర్యప్రభ వాహనంపై మలయప్ప స్వామి దర్శనం ఇవ్వనున్నారు. మధ్యాహ్నం 1 నుంచి 3 గంటల వరకు స్నపన కార్యక్రమం నిర్వహించనున్నారు.  ఇక రాత్రి 7 గంటలకు చంద్రప్రభ వాహనంపై స్వామివారిని తిరుమాడ విధుల్లో ఊరేగించనున్నారు.

22న మంగళవారం ఉదయం 7 గంటలకు శ్రీవారి రథోత్సవం, రాత్రి 7 గంటలకు అశ్వ వాహన సేవ నిర్వహించనున్నారు. చివరి రోజున ఆగస్టు 23న ఉదయం 6 గంటలనుంచి 9 గంటలవరకు వైఖానస శాస్త్ర ఆగమానుసారం శ్రీవారికి చక్రస్నానం నిర్వహించనున్నారు. రాత్రికి ధ్వజారోహణ కార్యక్రమంలో తిరుమలలో బ్రహ్మోత్సవాలు పూర్తవుతాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>