సీఎం రేవంత్‌పై కవిత తీవ్ర విమర్శలు

కలం, వెబ్ డెస్క్ : సీఎం రేవంత్ రెడ్డిపై టీఆర్ఎస్ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (TRS Chief Kavitha) తీవ్ర విమర్శలు చేశారు. కొడంగల్ నియోజకవర్గం కోస్గిలో నిర్వహిస్తున్న పాంచజన్య సంకల్ప సభలో ఆమె ప్రసంగించారు. టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే ఏం చేస్తామో చెప్పిన కవిత.. రేవంత్ రెడ్డి పాలనపై నిప్పులు చెరిగారు. ముఖ్యమంత్రికి రైతులకు నీళ్లు ఇచ్చే ఆలోచన లేదని ధ్వజమెత్తారు.

కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులకు నీళ్లు, ఎరువులు, కరెంట్ లేదని ఆమె (TRS Chief Kavitha) ఆవేదన వ్యక్తం చేశారు. నీళ్లు, యూరియా, ధాన్యం కొనుగోళ్ల కోసం రైతులు అధికారుల కాళ్లు పట్టుకోవాలా అని ప్రశ్నించారు. తెలంగాణ రక్షణ సేన అధికారంలోకి వస్తే పాలమూరులో 10 లక్షల ఎకరాలకు నీళ్లు అందిస్తామని కవిత హామినిచ్చారు. రాజకీయం అంటే బూతులు తిట్టుకోవడమేనా అని వివిధ పార్టీలను ఉద్దేశించి విమర్శలు గుప్పించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>