టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే ఉచిత విద్య, వైద్యం: కవిత

కలం, వెబ్ డెస్క్: రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ రక్షణ సేన పార్టీ (TRS) అధికారంలోకి వస్తే ఉచితంగా విద్యార్థులకు విద్య, ప్రజలకు వైద్యం అందిస్తామని ఆ పార్టీ అధ్యక్షురాలు కవిత (Kalvakuntla Kavitha) ప్రకటించారు. వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం కోస్గిలో ఆదివారం ఏర్పాటు చేసిన పాంచజన్య సంకల్ప భారీ బహిరంగ సభలో ఆమె మాట్లాడారు. విద్య, వైద్యం కోసం రూ. లక్షల కోట్లు అయినా ఖర్చు చేస్తామని అన్నారు. రాజకీయం అంటే ఎప్పుడూ బూతులు తిట్టుకోవడమేనా అని ప్రశ్నించారు. రైతులపై సీఎం రేవంత్ రెడ్డికి ప్రేమ లేదని.. పంటలకు నీళ్లు ఇచ్చేంత ఆలోచన లేదన్నారు. రైతులకు నీళ్లు లేవు, కరెంట్ లేదు, ఎరువు లేదు అంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>