ఉచిత వైద్య శిబిరాలతో ఎంతో ఉపయోగం: మంత్రి శ్రీహరి

కలం, నారాయణపేట: మనం చేసే మంచి పనులే మనల్ని కాపాడుతాయని రాష్ట్ర పాడి పరిశ్రమ అభివృద్ధి, క్రీడ, యువజన శాఖల మంత్రి వాకిటి శ్రీహరి (Vakiti Srihari) అన్నారు. మక్తల్ నియోజకవర్గం ఉట్కూర్ మండల కేంద్రంలో బీకేఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత మెగా హెల్త్ క్యాంపును మంత్రి శ్రీహరి ప్రారంభించి మాట్లాడారు. ఉట్కూర్‌లో ఇంత పెద్ద స్థాయిలో మెగా హెల్త్ క్యాంపును తొలిసారిగా ఏర్పాటు చేసిన ఫౌండేషన్ అధినేత బాలకృష్ణారెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. కార్పొరేట్ వైద్యం చేయించుకోలేని పేద, మధ్యతరగతి ప్రజలకు ఇలాంటి ఉచిత వైద్య శిబిరాలు ఎంతో ఉపయోగకరమని పేర్కొన్నారు. ఈ సందర్బంగా పేద పిల్లలకు డిజిటల్ పలకలు, రోగులకు మందులు, దుప్పట్లు పంపిణీ చేశారు. గ్రామ సర్పంచి రేణుక, బీకేఆర్ ఫౌండేషన్ అధినేత బాలకృష్ణా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>