భారత షూటర్లపై రాష్ట్రపతి ముర్ము ప్రశంసల జల్లు!

కలం, స్పోర్ట్స్ : ఆసియా గేమ్స్‌లో భారత మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ జట్టు రజత పతకంతో దేశ పతకాల ఖాతాను తెరవడాన్ని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము (President Droupadi Murmu) ఆదివారం కొనియాడారు. టోర్నీలో సోనమ్ ఉత్తమ్ మస్కర్ 634.1 పాయింట్లు, ఎలావెనిల్ వలరివన్ 633.5 పాయింట్లు, విదార్సా కే వినోద్ 630.4 పాయింట్లు సాధించారు. ఈ ముగ్గురూ కలిసి మొత్తం 1898.0 పాయింట్లతో భారత్‌కు రెండో స్థానాన్ని ఖాయం చేశారు. కాగా చైనా జట్టు 1904.2 పాయింట్లతో స్వర్ణం సాధించగా, ఆతిథ్య జపాన్ జట్టు 1897.1 పాయింట్లతో కాంస్య పతకాన్ని గెలుచుకుంది.

ఈ ఘనతపై రాష్ట్రపతి (Droupadi Murmu) స్పందిస్తూ, ఈ విజయం దేశానికి ఎంతో గర్వకారణమని, ముగ్గురు క్రీడాకారులకు అభినందనలు తెలుపుతూ రాబోయే పోటీల్లోనూ రాణించాలని ఆకాంక్షించారు. కేంద్ర హోం మంత్రి జై షా, కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు కూడా ‘ఎక్స్’ వేదికగా క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలిపారు. రజతంతో పతకాల ఖాతా తెరవడం ఎంతో సంతోషకరమని, ఈ విజయం భారత క్రీడా బృందానికి గొప్ప స్ఫూర్తినిస్తుందని వారు పేర్కొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>