మహిళపై దాడి: హోమ్ గార్డ్ ఆనంద్ అరెస్ట్!

కలం, వెబ్ డెస్క్ : హఫీజ్‌పేట్ రైల్వే స్టేషన్ వద్ద ఓ మహిళపై దాడికి పాల్పడిన ఘటనలో హోమ్ గార్డ్ ఆనంద్‌ను మియాపూర్ పోలీసులు అరెస్ట్ (Home Guard Arrest) చేశారు. ఆనంద్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి కస్టడీలోకి తీసుకున్నారు.

నిందితుడు ఆనంద్ రైల్వే పోలీస్ ఫోర్స్‌ (RPF) లో డిప్యూటేషన్‌పై పనిచేస్తున్నాడని డీజీపీ సీవీ ఆనంద్ తెలిపారు. సదరు హోమ్ గార్డ్‌ను వెంటనే సర్వీస్ నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించారు. అతడిపై క్రిమినల్ కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ అంశంలో తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సైబరాబాద్ పోలీస్ కమిషనర్‌ను ఆదేశించినట్లు డీజీపీ సీవీ ఆనంద్ వివరించారు. ఈ మేరకు పోలీసులు ఆనంద్ ను అరెస్టు చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>