జూరాల ఆయకట్టుకు సాగునీటి కష్టాలు.. రోడ్డెక్కిన రైతులు!

కలం, జోగులాంబ గద్వాల: జూరాల ప్రాజెక్టు (Jurala Project) మీద ఆధారపడి‌ ఉన్న కుడికాలువ రైతాంగానికి సాగునీటి కష్టాలు ఎదురయ్యాయి. తలాపున కృష్ణానది పారుతున్న సాగుకు నీరందని పరిస్థితి తలెత్తింది. వందలాది టీఎంసీల వరద నీరు శ్రీశైలానికి తరలించకపోతున్న.. నడిగడ్డ రైతాంగం గోస తెలంగాణ ప్రభుత్వానికి కనబడటం లేదు. జూరాల కుడి కాలువ ద్వారా సాగు నీరు విడుదల చేయాలంటూ శనివారం ధరూర్ మండలం జూరాల డ్యాం (Jurala Dam) మీద రైతులు ధర్నా (Farmers Protest) చేపట్టారు.

అదే విధంగా గద్వాల మండలం పలు గ్రామాల రైతులు జిల్లా కేంద్రంలోని జిల్లా‌ కలెక్టరేట్ ముంద ఉన్న కర్నూల్ రహదారిపై బైఠాయించి ఆందోళన చేపట్టారు‌. అటు డ్యాం మీద, ఇటు‌ గద్వాలలో ఒకే సారి జూరాల కుడి కాలువ రైతాంగం ఆందోళనకు దిగారు. తలాపున కృష్ణానది పారుతున్న జూరాల ఆయకట్టు రైతాంగానికి సాగు నీటి కష్టాలు ఎదురయాయని ఆవేదన వ్యక్తం చేశారు. జూరాల నుంచి ఆంధ్రకు 200 టీఎంసీలు వరద నీటిని తరలించలేకపోయారని కానీ జూరాల మీద ఆధారపడి ఉన్న వ్యవసాయానికి సాగునీటి విడుదల చేయడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. వరద సమయంలో జూరాల నుంచి కుడి‌కాలువ, నెట్టెంపాడు ఎత్తిపోతల పథకాల ద్వార చెరువులకు నీటిని నింపలేదని, దీంతో భూగర్బజలాలు ఎండిపోతున్నాయని ఆవేదన చేందారు‌.

అలాగే, అధికారులు చెప్పినట్లు గద్వాల మండలంలో పలు గ్రామాలలో ఆరుతడి పంటలు సాగుచేశామని, వారబంధీ ద్వార సాగునీరందించాలని డిమాండ్ చేశారు.‌ గద్వాలో గంటల తరబడి వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ధరూర్ మండలం జూరాల ప్రాజెక్టు ‌మీద చేస్తున్న రైతుల ధర్నాకు బీజేపీ నాయకులు మద్దతు పలికారు.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>