జోగిపేటలో భారీ అగ్నిప్రమాదం.. రెండు ఏటీఎం సెంటర్లు దగ్ధం!

కలం, మెదక్ బ్యూరో: సంగారెడ్డి (Sangareddy) జిల్లా జోగిపేట (Jogipet Fire) లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. పట్టణంలోని కూరగాయల మార్కెట్ గల్లీలోని రెండు ప్రముఖ ఏటీఎం కేంద్రాలు అగ్నికి ఆహుతయ్యాయి. కూరగాయల మార్కెట్ గల్లీలో ఉన్న యూనియన్ బ్యాంక్, SBI ఏటీఎంలలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం సంభవించినట్లు తెలుస్తుంది. ప్రమాద ఉధృతి ఎక్కువగా ఉండటంతో ఏటీఎం కేంద్రంలోని విలువైన ఎలక్ట్రానిక్ పరికరాలతో పాటు, అందులో నిల్వ ఉంచిన నగదు కూడా పూర్తిగా అగ్నికి ఆహుతైంది. భారీగా మంటలు ఎగిసిపడటంతో చుట్టుపక్కల ప్రాంత ప్రజలు భయాందోళనకు గురై రోడ్డుపైకి పరుగులు తీశారు.

సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని, శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. ప్రమాద సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. ఘటనకు గల అసలు కారణాలపై దర్యాప్తు ముమ్మరం చేశారు. ఏటీఎంలలో కాలిపోయిన నగదు ఎంత అనే వివరాలపై బ్యాంకు అధికారులతో కలిసి ఆరా తీస్తున్నారు. షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగిందా లేక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>