కలం, స్పోర్ట్స్: అఫ్ఘానిస్థాన్‌తో జరిగిన మూడో టీ20లో కూడా భారత్ అద్భుత విజయాన్ని అందుకుంది. అఫ్ఘానిస్థాన్‌ను 94 పరుగులకే ఆలౌట్ చేసి మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను క్లీన్ స్వీప్‌గా ముగించింది. అయితే అఫ్ఘాన్ బౌలర్లకు మాత్రం భారత ఓపెనర్లు సింహస్వప్నంలా మారారు. ఏ బంతి వేసినా బౌండ్రీ దాటిస్తూ పరుగుల వరద పారించారు. ఒకవైపు సంజూ శామ్‌సన్ అదరగొడుతుంటే.. మరోవైపు అభిషేక్ శర్మ (Abhishek Sharma) కూడా విజృంభించాడు. 30 బంతుల్లో సెంచరీ పూర్తి చేసి పలు రికార్డులు బద్దలు కొట్టాడు. వారిద్దరి వికెట్లు పడిన తర్వాత కూడా స్కోర్ కార్డ్ కొంచెం నెమ్మదించినా.. అఫ్ఘాన్ ముందు మాత్రం టీమిండియా 222 పరుగుల భారీ లక్ష్యాన్నే నిలిపింది.
అదరగొట్టిన ఓపెనర్లు..
మూడో టీ20లో టాస్ గెలిచిన అఫ్ఘానిస్థాన్ బౌలింగ్ ఎంచుకోవడంతో భారత్ (India vs Afghanistan) తొలుత బ్యాటింగ్ చేసింది. తొలి బంతి నుంచే భారత ఓపెనర్లు సంజూ శామ్‌సన్, అభిషేక్ శర్మ దూకుడుగా ఆడారు. తొలి పది ఓవర్లలో భారత బ్యాటర్ల దెబ్బకు అఫ్ఘాన్ బౌలర్లు బెంబేలెత్తిపోయారు. అభిషేక్ శర్మ.. బౌండ్రీల వర్షం కురిపించాడు. 24 బంతుల్లో 108 పరుగులు చేశాడు. కానీ తొమ్మిదో ఓవర్ లాస్ట్ బాల్‌కు రషీద్ ఖాన్ బౌలింగ్‌లో రహమనుల్లాకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఆతర్వాత క్రీజులోకి అడుగు పెట్టిన తిలక్ వర్మ.. 5 బంతుల్లో 2 పరుగులు చేసి రషీద్ ఖాన్ బౌలింగ్‌లో రనౌట్ అయ్యాడు. ఎదురు వికెట్లు పడతున్నా సంజూ శామ్‌సన్ మాత్రం ఒత్తిడికి గురికాకుండా ఆడాడు. కానీ 164 పరుగుల దగ్గర భారత్ తన మూడో వికెట్ కోల్పోయింది.
35 బంతుల్లో 50 పరుగులు చేసిన సంజూ.. అజ్మతుల్లా ఒమర్‌జాయ్ బౌలింగ్‌లో రషీద్ ఖాన్‌కు క్యాచ్ అవుటయ్యాడు. ఆ తర్వాత శివమ్ దూబేతో కలిసి కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ స్కోర్‌ను ముందుకు నడిపించాలని ప్రయత్నించినా అనుకున్నంతగా స్కోర్ కదలలేదు. శివమ్ దూబే(14), శ్రేయస్ అయ్యర్(29), నితీష్ కుమార్(1), అక్సర్ పటేల్(5), రవి బిష్ణోయ్(0) పరుగులు చేశారు. దీంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసింది. అఫ్ఘానిస్థాన్ బౌలర్లలో అజ్మతుల్లా ఒమర్‌జాయ్ రెండు వికెట్లు పడగొట్టి పర్వాలేదనిపించాడు. 3 ఓవర్లు బౌలింగ్ చేసిన 27 పరుగులిచ్చాడు. ఆ తర్వాత రషీద్ ఖాన్, అబ్దుల్లా అహ్మద్‌జాయ్ చెరో వికెట్ తీశారు.
అఫ్ఘాన్‌కు అక్సర్ షాక్..
222 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన అఫ్ఘానిస్థాన్‌కు ఓపెనర్ రహ్మనుల్లా గుర్బాజ్‌ను బౌల్డ్ చేసి అక్సర్ పటేల్ భారీ షాకిచ్చాడు. 11 బంతులు ఆడిన గుర్బాజ్ 15 పరుగులకే వెనుదిరిగాడు. ఆ తర్వాత కెప్టెన్, రెండో ఓపెనర్ జద్రాన్ సైతం ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. 16 బంతుల్లో 25 పరుగులు చేసి యశ్ ఠాగుర్ బౌలింగ్‌లో అభిషేక్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత సెదికుల్లా అటల్.. బుమ్రా బౌలింగ్‌లో డకౌట్ అయ్యాడు. నూర్ ఉల్ రహ్మాన్(11), మొహమ్మద్ నబి (8), అజ్మతుల్లా ఒమర్‌జాయ్(17), రషీద్ ఖాన్ (6), ముజీద్ ఉర్ రెహ్మాన్ (0), అబ్దుల్లా అహ్మద్‌జాయ్ (6) పరుగులకే అవుటయ్యారు. దీంతో అఫ్ఘానిస్థాన్ 9 పరుగులకే ఆలౌట్ అయింది.
భారత బౌలర్లలో మరోసారి నితీష్ కుమార్ రెడ్డి, రవి బిష్ణోయ్ మెరిశారు. 3.1 ఓవర్లు బౌలింగ్ చేసిన రవి బిష్ణోయ్ 26 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు. 4 ఓవర్లు బలింగ్ చేసిన నితీష్ కుమార్.. 25 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీశాడు. అక్సర్ పటేల్ 3 ఓవర్లు బౌలింగ్ చేసి 9 పరుగులే ఇచ్చి అఫ్ఘాన్‌ను అద్భుతంగా కట్టడి చేయడంతో పాటు రెండు కీలక వికెట్లను కూడా పడగొట్టాడు. జస్ప్రిత్ బుమ్రా, యశ్ ఠాకుర్ చెరో వికెట్ తీశారు. దీంతో మూడో టీ20లో కూడా భారత్ అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది.

