అమరుల త్యాగాలు స్మరించుకునే రోజు: సంజీవ్ ముదిరాజ్

కలం, మహబూబ్ నగర్ బ్యూరో: తెలంగాణ విలీన దినోత్సవాన్ని పురస్కరించుకుని మహబూబ్‌నగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో డీసీసీ అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్ (Sanjeev Mudiraj) అధ్యక్షతన జాతీయ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజల స్వేచ్ఛ, గౌరవం, ప్రజాస్వామ్య హక్కుల కోసం అనేక మంది పోరాటాలు చేశారన్నారు. సెప్టెంబర్ 17వ తేదీ అమరుల త్యాగాలను స్మరించుకునే పవిత్రమైన రోజని పేర్కొన్నారు.

నాటి పోరాట యోధులు ప్రజల హక్కులు, స్వేచ్ఛ, సమానత్వం కోసం చేసిన పోరాట స్ఫూర్తిని నేటి తరానికి అందించాల్సిన అవసరం ఉందని సంజీవ్ ముదిరాజ్ అన్నారు. ప్రజాస్వామ్య విలువలు, సామాజిక న్యాయం, సమానత్వం, సౌభ్రాతృత్వం, ప్రజల హక్కుల పరిరక్షణకు కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని తెలిపారు. తెలంగాణ చరిత్రను, నాటి పోరాటాల స్ఫూర్తిని భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందన్నారు.

ఈ కార్యక్రమంలో డీసీసీ జనరల్ సెక్రటరీ సత్తూర్ చంద్ర కుమార్ గౌడ్, డీసీసీ ఉపాధ్యక్షులు బెక్కరి మధుసూదన్ రెడ్డి, డీసీసీ జనరల్ సెక్రటరీలు రాములు యాదవ్, కలీమ్, మాజీ మార్కెట్ కమిటీ ఛైర్మన్ బెక్కరి అనితా రెడ్డి, మీడియా సెల్ సీజే బెనహర్, కార్పొరేటర్ ఎంపీ ప్రవీణ్ కుమార్, ఉమర్ కోత్వాల్, రమేష్ బాబు, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు పసుల రాజు, జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు అవేజ్, టౌన్ వర్కింగ్ ప్రెసిడెంట్ అజ్మత్ అలీ, సేవాదళ్ నాయకులు జగదీష్, అబూకర్, వెంకటలక్ష్మి, అలీ, కాంగ్రెస్ నాయకులు ఉషారాణి, జగదీష్, అక్బర్, రఫీక్, గోపాల్ యాదవ్, గంజి ఆంజనేయులు, బూరెమోని చందు యాదవ్, మురళీ గౌడ్, రామచందర్, విజయ్ కుమార్ పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>