ఎర్రవెల్లిలో సర్వే నంబర్ 325లో భూముల సర్వే ప్రారంభం

కలం, సిద్దిపేట: జిల్లాలోని మార్కుక్ మండలం ఎర్రవెల్లి గ్రామ పరిధిలోని 325 సర్వే నంబర్‌ పరిధిలో గల దాదాపు 388 ఎకరాల లావణి పట్టా భూముల సర్వే (Erravalli Land Survey) పనులు గురువారం ప్రారంభమయ్యాయి. రెవెన్యూ, సర్వే అధికారుల ప్రత్యక్ష సమక్షంలో ఈ భూమి కొలతల ప్రక్రియను ప్రారంభించారు. ఈ సర్వే ద్వారా సంబంధిత భూములకు సంబంధించిన హద్దులను ఖచ్చితంగా నిర్ణయించి, సరిహద్దు రాళ్లను ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. వివాదాస్పంగా, దీర్ఘకాలంగా ఉన్న భూ సరిహద్దుల సమస్యలకు ఈ సర్వేతో పరిష్కారం లభించనుంది.

ఈ కార్యక్రమాన్ని జిల్లా స్థాయి ఉన్నతాధికారులు, గజ్వేల్ ఆర్‌డీఓ (RDO) నేరుగా సందర్శించి, పనులను క్షేత్రస్థాయిలో పర్యవేక్షించారు. సర్వే పనులను పారదర్శకంగా, ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా పూర్తి చేయాలని కిందిస్తాయి సిబ్బందికి ఆదేశించారు. ఈ కార్యక్రమంలో స్థానిక తహశీల్దార్, మండల సర్వేయర్, రెవెన్యూ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>