గద్వాలలో ఘనంగా విమోచన దినోత్సవం

కలం, జోగులాంబ గద్వాల: నిజాం నిరంకుశ పాలన, రజాకార్ల అరాచకాలకు వ్యతిరేకంగా పోరాటాలు చేసి, ప్రాణ త్యాగాలు చేసిన అమరవీరులను స్మరించుకుంటూ ‘తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలను‌ గురువారం గద్వాల పట్టణంలో బీజేపీ‌‌ (Gadwal BJP) నేతలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించారు. జిల్లా అధ్యక్షుడు రామాంజనేయులు, యువ నాయకురాలు డికే. స్నిగ్ధారెడ్డి, పట్టణ అధ్యక్షురాలు రజక జయశ్రీ మాట్లాడారు. సెప్టెంబర్ 17వ తేదీ తెలంగాణ ప్రజల పోరాటం, త్యాగం, స్వాభిమానానికి ప్రతీక అన్నారు. నిజాం రాక్షస పాలన నుంచి విముక్తి పొందిన అత్యంత ప్రాముఖ్యత కలిగిన రోజన్నారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ బండల వెంకట రాములు, జిల్లా ప్రధాన కార్యదర్శి రవి కుమార్ ఎక్బోటే, జిల్లా బీజేవైఎం అధ్యక్షుడు బాబుల్ రెడ్డి, మహిళా మోర్చా అధ్యక్షురాలు సమత మధు గౌడ్, జిల్లా ఓబీసీ మోర్చా అధ్యక్షుడు దేవదాస్, రాష్ట్ర OBC మోర్చా కార్యవర్గ సభ్యుడు అనిల్, కౌన్సిలర్లు శాలన్న, చంద్ర శేఖర్, నాయకులు మీర్జాపురం వెంకటేశ్వర రెడ్డి, పరమేశ్వర రెడ్డి, రజక నరసింహ, అక్బర్, మోహన్ రెడ్డి, సతీష్ మధు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>