కలం, స్టేషన్ ఘన్పూర్: పాలిటెక్నిక్ విద్యకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన జీవో నెంబర్ 97ను వెంటనే రద్దు చేయాలని అధ్యాపకులు డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని 59 ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల అధ్యాపక బృందాలు తీసుకున్న నిర్ణయం మేరకు స్టేషన్ ఘన్పూర్ (Station Ghanpur) ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో నేటి నుంచి జరగాల్సిన మిడ్ పరీక్షలను బహిష్కరించారు.
ఈ సందర్భంగా అధ్యాపకులు మాట్లాడుతూ జీవో ద్వారా తీవ్ర అన్యాయం జరుగుతోందన్నారు. జీవో రద్దు చేసే వరకు మిడ్ పరీక్షల బహిష్కరణ కొనసాగుతుందన్నారు. తమ డిమాండ్‌పై సానుకూల నిర్ణయం తీసుకున్న తర్వాతే పూర్తి స్థాయిలో బోధన, పరీక్షల కార్యక్రమాలను కొనసాగిస్తామని తెలిపారు. విద్యార్థుల విద్యా భవిష్యత్తుకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం తక్షణమే స్పందించి జీవో రద్దు చేయాలని అధ్యాపకులు కోరారు.

