ప్రధాని జన్మదినం సందర్భంగా మెగా రక్తదాన శిబిరం

కలం, నిర్మల్ రూరల్: దేశ ప్రధాని నరేంద్ర మోదీ 76వ జన్మదిన వేడుకలను పురస్కరించుకొని నిర్మల్ (Nirmal) రూరల్ మండలం తల్వేదలోని బీజేపీ జిల్లా పార్టీ కార్యాలయంలో గురువారం మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. అంతకుముందు తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకొని పార్టీ కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం విశ్వకర్మ జయంతి సందర్భంగా భగవాన్ శ్రీ విశ్వకర్మ చిత్రపటానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు నిరంజన్ రెడ్,డి ఆయా మండలాల అధ్యక్షులు వెంకట్ రెడ్డి, బర్కుంట నరేందర్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>