కలం, దేవరకొండ : పర్యావరణ పరిరక్షణతో పాటు భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని బాధ్యతగా సంరక్షించాలని దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ (MLA Balu Naik) పిలుపునిచ్చారు. చింతపల్లి మండలం పోలేపల్లి–రాంనగర్ గ్రామ పంచాయతీ పరిధిలోని వనమైసమ్మ గుడి ఆవరణలో కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ఆయన గురువారం మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాలునాయక్ మాట్లాడుతూ… మొక్కలు నాటడం ద్వారా పచ్చదనం పెరగడమే కాకుండా వాతావరణ సమతుల్యత కాపాడబడుతుందని బాలునాయక్ తెలిపారు. చెట్లు గాలిలోని కాలుష్యాన్ని తగ్గించి ప్రజలకు స్వచ్ఛమైన ఆక్సిజన్ అందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. కేవలం మొక్కలు నాటడంతో సరిపెట్టకుండా, అవి పెద్ద చెట్లుగా ఎదిగేలా సంరక్షించాల్సిన అవసరం ఉందని ఆయన (MLA Balu Naik) స్పష్టం చేశారు. ప్రతి గ్రామంలో విస్తృతంగా పచ్చదనాన్ని పెంపొందించడానికి ప్రజలు, యువత, ప్రజాప్రతినిధులు, వివిధ రంగాల నాయకులు సమిష్టిగా కృషి చేయాలని కోరారు.
కార్యక్రమంలో స్థానిక నాయకులు జాటావత్ హరినాయక్, దొంతమోని యాదమ్మ, మాస భాస్కర్, దొంతినేని వెంకటేశ్వరరావు, సిద్దగోని కృష్ణ గౌడ్, మునుకుంట్ల శేఖర్, కొడిదొడ్డి శంకర్, కొప్పుల జంగయ్య, నేనావత్ జవహర్ లాల్, నేనావత్ వసంత్ నాయక్, ఉప్పు శ్రీశైలం, కేతావత్ శ్రీను, మునుకుంట్ల శేఖర్ గౌడ్ తో పాటు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

