జిల్లా వ్యాప్తంగా ఘనంగా విమోచన దినోత్సవ వేడుకలు

కలం, కరీంనగర్: కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు, దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జన్మదినోత్సవ వేడుకలు, విశ్వకర్మ జయంతి వేడుకలు అత్యంత ఘనంగా, వైభవంగా నిర్వహించారు. కరీంనగర్ లో జరిగిన వేడుకలకు బీజేపీ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు సాయిని మల్లేశం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా కరీంనగర్ లోని పార్లమెంట్ కార్యాలయం వద్ద జిల్లా అధ్యక్షుడు సాయిని మల్లేశం జెండాను ఆవిష్కరించి మాట్లాడారు.

నిజాం రజాకారుల రాక్షస పాలన నుండి తెలంగాణ ప్రజలకు విముక్తి లభించిన చారిత్రక దినం సెప్టెంబర్ 17 అని సాయిని మల్లేశం గుర్తుచేశారు. ఎంతో మంది అమరుల త్యాగాల ఫలితంగానే విముక్తి సాధ్యమైందని, నాటి పోరాటయోధులను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం అధికారికంగా విమోచన దినోత్సవాన్ని నిర్వహిస్తున్న, రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించకపోవడం బాధాకరమన్నారు. రజాకర్ వారసుల పార్టీ కి భయపడే కాంగ్రెస్ సర్కార్ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించడం లేదని ఆయన ఆరోపించారు.

ఘనంగా ప్రధాని జన్మదినోత్సవ వేడుకలు..

ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినోత్సవాన్ని జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని బీజేపీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మేయర్ కోలగని శ్రీనివాస్ ఆధ్వర్యంలో నగరంలోని శ్రీ మహాశక్తి దేవాలయంలో ఆయుష్షు హోమం, గణపతి హోమం ప్రత్యేక పూజలు జరిగాయి. ఈ సందర్భంగా సాయిని మల్లేశం మాట్లాడుతూ.. దేశ ప్రజల సంక్షేమం కోసం అంకితభావంతో పనిచేస్తున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు జీవించి , దేశానికి మరింత సేవ చేయాలని ఆకాంక్షించారు. మోదీ నాయకత్వంలో భారత్ ప్రపంచ దేశాల సరసన అగ్రగామిగా నిలుస్తోందని కొనియాడారు.

ఘనంగా విశ్వకర్మ జయంతి వేడుకలు..

బీజేపీ ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు ఆకుల రాజేందర్ ఆధ్వర్యంలో గురువారం రోజున కరీంనగర్ లో విశ్వకర్మ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సాయిని మల్లేశం విశ్వకర్మ చిత్రపటానికి పూలమాల వేసి మాట్లాడారు. శ్రామిక లోకానికి ఆరాధ్య దైవమైన భగవాన్ విశ్వకర్మ జయంతి సందర్భంగా దేశంలోని సమస్త కార్మిక లోకానికి, చేతివృత్తిదారులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్లు చెప్పారు. దేశ నిర్మాణంలో శిల్పులు, చేతివృత్తి నిపుణుల పాత్ర ఎనలేనిదన్నారు. ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి అడిచర్ల రాజు మాట్లాడుతూ.. సమాజానికి విశ్వకర్మలు దిక్సూచిగా ఉన్నారని, విశ్వకర్మలు లేనిదే సృష్టి లేదన్నారు.

ఈ వేడుకల్లో మేయర్ కోలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావు, పార్లమెంటు కన్వీనర్ బోయిన్పల్లి ప్రవీణ్ రావు, బిజెపి సీనియర్ నాయకులు గుజ్జ శ్రీనివాసరావు, కార్పొరేటర్ లు బండ రమణారెడ్డి , బండారి వేణు , ఎన్నం ప్రకాష్, కర్రే అనిల్, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు మోతే గంగారెడ్డి , ఆడిచర్ల రాజు, పుప్పాల రఘు, కనుమల్ల గణపతి, కటకంలోకేష్, దురిశెట్టి సంపత్, జాన పట్ల స్వామి , కోలా అశోక్, వైద రామానుజమ్, కడార్ల రతన్, గర్దాస్ సతీష్, గుంజేటి శివకుమార్, గాజుల సప్న, సుధాకర్ పటేల్, వాసు, కైలాస నవీన్, కందుల వెంకటేష్ వెంగళ రవిగోపాల్, కొమ్ము మధుకర్, దయ్యాల మల్లేశం తదితరులు పాల్గొన్నారు

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>