కలం, ఆదిలాబాద్ : ఆదిలాబాద్ (Adilabad) జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయ ఆవరణలో తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ (Praja Palana Dinotsavam) వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ (Mohammed Ali Shabbir) పోలీసుల గౌరవ వందనం స్వీకరించి జాతీయ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అమర వీరుల స్తూపం వద్ద నివాళులర్పించారు. తెలంగాణ హాకీ అకాడమీకి ఎంపికైన 15 మంది జిల్లా క్రీడాకారులకు హాకీ స్టిక్‌లను, 30 వేల నగదును ప్రభుత్వ సలహాదారుల చేతుల మీదుగా అందజేసి అభినందించారు.
ఈ వేడుకలలో జిల్లా కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ అఖిల్ మహాజన్, ఎమ్మెల్యే పాయల శంకర్, అదనపు కలెక్టర్లు ఆర్.ఎస్. చిత్రు, ఎస్.రాజేశ్వర్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నర్సయ్య, మున్సిపల్ చైర్ పర్సన్ బండారి అనూషా, మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, సబ్ కలెక్టర్ ప్రణయ్ కుమార్, అదనపు ఎస్పీ మౌనిక, ఏఎస్పీ రిత్విక్ సాయి కొట్టే, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.
Also Read : జిన్‌పింగ్‌కు బ్రెయిన్ స్ట్రోక్.. అసలేం జరిగింది?
Follow Us On: X(Twitter)

