కలం, నిర్మల్: నిర్మల్ జిల్లాలో ఆయిల్ పామ్ సాగును (Oil Palm Cultivation) విస్తరించేందుకు రైతులను ప్రోత్సహిస్తూ కృషి చేస్తున్న వ్యవసాయ శాఖ మండల అధికారులు, ఏఈఓలను ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ప్రత్యేకంగా అభినందించారు. గురువారం నిర్మల్ జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ వేడుకల్లో ఆయిల్ పామ్ సాగు విస్తరణకు కృషి చేసిన వ్యవసాయ శాఖ మండల అధికారులు, ఏఈఓలకు ప్రశంస పత్రాలను అందజేశారు.
రైతులకు ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన కల్పిస్తూ, ఆయిల్ పామ్ సాగు ద్వారా దీర్ఘకాలికంగా ప్రయోజనాలు పొందేలా ప్రోత్సహిస్తున్న అధికారుల సేవలను ఈ సందర్భంగా వేముల వీరేశం (Vemula Veeresham) కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా, అదనపు కలెక్టర్ బి.వెంకటేశ్వర్లు, డీఎఫ్ఓ సుశాంత్ సుఖదేవ్ బోబడే, డీఆర్వో రాథోడ్ రమేష్ తదితర అధికారులు పాల్గొన్నారు.

