మరో అద్భుత రికార్డు సృష్టించిన మెస్సీ!

క‌లం, స్పోర్ట్స్: లియోనెల్ మెస్సీ (Lionel Messi) తన కెరీర్‌లో మరో అద్భుత రికార్డు సృష్టించాడు. ఫ్లోరిడాలో జరిగిన కాంపియోన్స్ కప్ ఫైనల్ లో మెస్సీ 100వ గోల్ సాధించాడు. క్రూజ్ అజుల్ జట్టుపై ఇంటర్ మయామి 2-0తో గెలిచి ట్రోఫీ గెలుచుకుంది. కొత్త కోచ్ క్రిస్టియన్ గొంజాలెజ్ నేతృత్వంలో మయామికి ఇది తొలి విజయం. మ్యాచ్ 24వ నిమిషంలో లూయిస్ సువారెజ్ ఇచ్చిన క్రాస్‌ను మెస్సీ హెడర్‌తో గోల్‌గా మలిచాడు. తరువాత కాసిమిరో మరో గోల్ కొట్టి విజయాన్ని ఖాయం చేశాడు. కేవలం 115 మ్యాచుల్లోనే మెస్సీ 100 గోల్స్ మార్కును చేరుకున్నాడు.

ఏదైనా ఒక క్లబ్ లేదా దేశం తరఫున అతివేగంగా ఈ మైలురాయిని తాకిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. గతంలో బార్సిలోనా తరఫున 188 మ్యాచుల్లో, అర్జెంటీనా తరఫున 174 మ్యాచుల్లో ఈ ఘనత సాధించాడు. ఇంటర్ మయామిలో చేరినప్పటి నుంచి మెస్సీ ఎంఎల్ఎస్ లీగ్‌లో 76 గోల్స్ చేశాడు. లీగ్స్ కప్‌లో 14, కాంకాకాఫ్ ఛాంపియన్స్ కప్‌లో 8, ఫిఫా క్లబ్ వరల్డ్ కప్‌లో ఒక గోల్ కొట్టాడు. ఈ గెలుపుతో మయామి క్లబ్‌కు నాల్గో ట్రోఫీ దక్కింది. మెస్సీ కెరీర్‌లో ఇది 49వ ట్రోఫీ కావడం విశేషం.

తాము ఖచ్చితంగా ఛాంపియన్ అవుతామని మెస్సీ (Lionel Messi) తనతో చెప్పాడని మయామి కోచ్ క్రిస్టియన్ గొంజాలెజ్ తెలిపారు. మరోవైపు మెస్సీ తన అంతర్జాతీయ కెరీర్‌కు వీడ్కోలు చెప్పడానికి సిద్ధమయ్యాడు. అక్టోబర్ 6న బ్యూనస్ ఎయిరెస్ వేదికగా బెనిన్‌తో జరిగే మ్యాచ్ మెస్సీకి చివరిది. తన చివరి మ్యాచ్ కోసం మెస్సీ, డి పాల్, లో సెల్సో జట్టులో చేరనున్నట్లు అర్జెంటీనా ఫుట్‌బాల్ అసోసియేషన్ తెలిపింది.

అర్జెంటీనా తరఫున 207 మ్యాచుల్లో మెస్సీ 125 గోల్స్ చేశాడు. తన కెరీర్‌లో అర్జెంటీనాకు ఒక వరల్డ్ కప్, రెండు కోపా అమెరికా కప్‌లను అందించాడు. చాలా ఆలోచించిన తర్వాతే రిటైర్మెంట్ నిర్ణయం తీసుకున్నట్లు మెస్సీ గతంలో ప్రకటించాడు. ఈ నిర్ణయం ఎంతో బాధ కలిగించినా, సరైన సమయం వచ్చిందని తెలిపాడు. దేశం కోసం ఎల్లప్పుడూ శ్రమించానని పేర్కొన్నాడు.

Also Read : మోదీ పుట్టిన రోజు.. కొత్త మంత్రం చెప్పిన చంద్రబాబు

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>