కలం, నిర్మల్: నిర్మల్ (Nirmal) జిల్లా పోలీస్ కార్యాలయంలో గురువారం ప్రజాపాలన దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. జిల్లా ఎస్పీ జానకి షర్మిల (SP Janaki Sharmila) జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనం స్వీకరించారు.
ఈ సందర్భంగా ఎస్పీ జానకి షర్మిల మాట్లాడుతూ.. ప్రజలకు సమర్థవంతమైన, పారదర్శకమైన పోలీసు సేవలు అందించడంతో పాటు శాంతిభద్రతల పరిరక్షణకు అంకితభావంతో పనిచేయాలని పోలీసు అధికారులు, సిబ్బందికి సూచించారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను సత్వరం పరిష్కరించేలా విధులు నిర్వహించాలని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో డీఎస్పీ శ్రీనివాస్, ఏఓ ఎండీ యూనుస్ అలీ, సీఐలు కృష్ణ, సమ్మయ్య, మల్లేష్, గోవర్ధన్ రెడ్డి, ఆర్‌ఐ అడ్మిన్ రామ్ నిరంజన్, ఎస్సైలు, ఆర్‌ఎస్సైలు, డీపీఓ, ఐటీ కోర్, భరోసా సిబ్బంది, పాల్గొన్నారు.

