తుర్కపల్లిలో ఇంచార్జ్ కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు

కలం, యాదగిరిగుట్ట: యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి (Turkapally) పీహెచ్‌సీని జిల్లా ఇంచార్జ్ కలెక్టర్ భాస్కర్ రావు (Bhaskar Rao) ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పీహెచ్‌సీలో అందుతున్న వైద్య సేవలు, రోగుల నమోదు, మందుల లభ్యత, వైద్య పరీక్షలు, సిబ్బంది హాజరు తదితర అంశాలను పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు మెరుగైన ప్రాథమిక వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఆసుపత్రికి వచ్చిన రోగులతో స్వయంగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు.

అనంతరం తుర్కపల్లి (Turkapally) తహశీల్దార్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన ఇంచార్జ్ కలెక్టర్.. వివిధ రికార్డులు, ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తుల వివరాలను పరిశీలించారు. కార్యాలయానికి వచ్చే ప్రజలకు ప్రభుత్వ సేవలు సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కుల, ఆదాయ, నివాస ధ్రువపత్రాలను నిబంధనల ప్రకారం పరిశీలించి అర్హులకు త్వరితగతిన అందించాలని ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కారంలో జాప్యం లేకుండా ప్రతి దరఖాస్తును పరిశీలించి సకాలంలో పరిష్కరించాలని సూచించారు.

అలాగే తుర్కపల్లి మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయాన్ని కూడా ఆకస్మికంగా తనిఖీ చేశారు. వివిధ శాఖలకు సంబంధించిన రికార్డులు, అభివృద్ధి పనుల పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. చేయూత పెన్షన్లు, సామాజిక భద్రత పెన్షన్ల దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి పెండింగ్ లేకుండా చూడాలని ఆదేశించారు. అర్హులైన లబ్ధిదారులకు పథకాల ప్రయోజనాలు ఎలాంటి జాప్యం లేకుండా అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. గ్రామాల్లో చేపడుతున్న ఫామ్ పాండ్ పనులను వేగవంతం చేసి పెండింగ్ లేకుండా పూర్తి చేయాలని భాస్కర్ రావు ఆదేశించారు. పనుల పురోగతిని క్షేత్రస్థాయిలో నిరంతరం పర్యవేక్షించాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Also Read : వినాయక నిమజ్జనంలో తీవ్ర విషాదం.. ఆరుగురు పిల్లలు మృతి

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>